జీవో 118 బాధితుల సమస్యలపై ప్రత్యేక సభ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: సరూర్ నగర్
జీవో 118 బాధితుల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎల్బీనగర్ నియోజకవర్గ బాధితులతో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై బాధితుల సమస్యలపై చర్చిస్తారని తెలిపారు.