విశాఖ నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నాన్స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం

రిపోర్టర్: సతీష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఆకాశ ఎయిర్ సంస్థ నాన్స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు. ఈ అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ప్రతిరోజూ ఈ విమానాలు నడుస్తాయని వారు తెలిపారు. విశాఖలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం బయలుదేరే ఈ సర్వీసులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటాయని, దీనివల్ల వ్యాపారవేత్తలు, విద్యార్థులు, పర్యాటకులకు రాకపోకలు మరింత సులభం అవుతాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.