నాగార్జున, రవితేజలతో భారీ మల్టీస్టారర్ సినిమా మిస్సవ్వడానికి అసలు కారణం ఇదే
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ గతంలో నాగార్జున, రవితేజ కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేశారని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని సినీ వర్గాలు వెల్లడించాయి. అప్పట్ లో రవితేజ హీరోగా ఫుల్ ఫామ్ లో ఎదుగుతుండటంతో సెకండ్ రోల్ చేయడానికి వెనుకడుగు వేశారని, దాంతో ఆ కథలో మార్పులు చేసి సోనూసూద్ తో 'సూపర్' సినిమా తెరకెక్కించారని పూరి జగన్నాధ్ తెలిపారు.