బ్యాంక్ సమ్మె కలకలం: నేడు ఐడీబీఐ శాఖల్ లో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె కారణంగా మంగళవారం బ్యాంకు శాఖల్ లో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగనుందని బ్యాంకు అధికారులు వెల్లడించారు. నవంబర్ రెండు, మూడు తేదీల్ లో ఉద్యోగులు ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాంచ్ సేవలు నిలిచిపోయినప్పటికీ, ఖాతాదారులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేలా బ్యాంకు యాజమాన్యం కొన్ని ప్రత్యామ్నాయ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు.