తెలంగాణ ఉద్యోగులకు త్వరలో రెండు డీఏల విడుదలపై సీఎం రేవంత్ కసరత్తు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పెండింగ్లో ఉన్న ఆరు కరువు భత్యం వాయిదాలలో కనీసం రెండింటిని వెంటనే విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సానుకూలంగా ఉంది. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమై డీఏల చెల్లింపుతో పాటు త్వరలో నూతన వేతన సవరణ సంఘం సిఫార్సుల అమలుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉండటంతో లక్షలాది మంది ఉద్యోగులలో తీవ్ర ఆసక్తి నెలకొంది.