ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పాస్పోర్ట్ స్వాధీనానికి ఏసీబీ పిటిషన్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మరో ముగ్గురిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ ఎడిటర్ సుధాకర్ ఉడుముల వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుల ప్రయాణాలను నియంత్రించే ఉద్దేశంతోనే వారి పాస్పోర్ట్లను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు.