పీఎం రహత్ పథకం: బాధితులకు ఉచిత వైద్యంపై ఎస్పీ జగిత్యాల ప్రకటన

రిపోర్టర్: హరి స్థలం: జగిత్యాల

రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ జగిత్యాల పిలుపునిచ్చారు. జిల్లాలోని ముప్పై ప్రధాన ఆసుపత్రుల్లో ఈ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ పథకం కింద నిబంధనల ప్రకారం ఒకటిన్నర లక్షల వరకు, ఏడు రోజుల పాటు నగదు రహిత చికిత్స పొందవచ్చని, ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మొదటి రెస్పాన్డెంట్గా వ్యవహరించాలని కోరారు.