నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు: నగర పోరులో కీలకం కానున్న మహిళా ఓటర్లు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మహిళా ఓటర్లే అత్యంత కీలకం కానున్నారని అధికారులు తెలిపారు. నగరంలోని డెబ్బై రెండు డివిజన్లలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉందని వెల్లడించారు. మొత్తం ఓటర్లలో మహిళలు రెండు లక్షల యాభై ఒక్క వేలకు పైగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో అభ్యర్థులు అందరూ మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ విభిన్న హామీలు గుప్పిస్తున్నారని తెలిపారు.