నీట్ ఎండీఎస్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎంసీసీ
రిపోర్టర్: సునీల్
స్థలం: India
నీట్ ఎండీఎస్ 2026 రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సెప్టెంబర్ 23న సీట్ల కేటాయింపు ఫలితాలు వెలువడతాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 24 నుంచి 30 లోపు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.