కుప్పంలో రూ.10 కోట్లతో కార్యాలయాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

రిపోర్టర్: కృష్ణ స్థలం: Kuppam

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్డీఓ మరియు ఏఎస్పీ కార్యాలయాల భవన నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.