జేఎన్‌టీయూ గురజాడలో మార్కుల మార్పిడి అక్రమాలు వెలుగులోకి
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
విజయనగరం జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో మార్కుల మార్పిడి అక్రమాలు కలకలం రేపాయి. సున్నా మార్కులు వచ్చిన విద్యార్థికి 40 మార్కులు వేసి, ఒప్పంద సహాయ అధ్యాపకుడు శివకుమార్ నిర్వాకానికి పాల్పడ్డారు. అయిదుగురు విద్యార్థుల జవాబు పత్రాల్లో మార్కులు మార్చినట్లు అంతర్గత విచారణలో తేలింది. వర్సిటీ వీసీ సుబ్బారావు ఆదేశాల మేరకు విజయనగరం గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.