'ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు': కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని వైసీపీ మండిపడింది. ఈ కుంభకోణంపై నిలదీస్తున్న వారి గొంతులు నొక్కేయడానికి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికే పాతరేస్తోందని ఆరోపించింది. ఈ అక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయిస్తూ నీచ రాజకీయాలకు తెరలేపుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.