రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్.

రిపోర్టర్: రమేష్ స్థలం: India

సినిమా రంగం నుండి తాను రిటైర్ కావడం లేదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. తన బ్లాగ్ పోస్ట్‌లో తాను వాడిన పదాలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. నిద్రపోవడానికి వెళుతున్నానని చెప్పడానికే ఆ పదాన్ని వాడానని, తన రిటైర్మెంట్ ప్రచారంపై వస్తున్న వదంతులకు ఆయన తనదైన శైలిలో హాస్యభరితంగా తెరదించారు.