సెన్సార్ బోర్డ్లో భారీ డేటా లీక్: వెబ్సైట్లో వందలాది రహస్య పత్రాలు ప్రత్యక్షం

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర సెన్సార్ బోర్డు డిజిటల్ వ్యవస్థలో భారీ డేటా ఉల్లంఘన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ఈ-సినీ ప్రమాణ్ పోర్టల్ నుంచి వందలాది దరఖాస్తు పత్రాలు, రహస్య డాక్యుమెంట్లు ఇంటర్నెట్ ఆర్కైవ్లో లీక్ కావడంతో సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి పేరును రష్యన్ భాషలో మార్చుకున్న యూజర్ అకౌంట్ ద్వారా ఈ పత్రాలను అప్లోడ్ చేసినట్లు తేలిందని, దీంతో సెన్సార్ బోర్డు సర్వర్ల భద్రతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.