ఆమనగల్లు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఘనంగా ఉచిత యూనిఫాంల పంపిణీ
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు మున్సిపాలిటీలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో స్థానిక కౌన్సిలర్ సునీత ప్రశాంత్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు హాలిమ బేగంతో కలిసి విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉచితంగా ఏకరూప దుస్తులను అందజేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులందరూ క్రమం తప్పకుండా బడులకు వెళ్ళాలని ఆకాంక్షించారు.