ఏపీలో మరో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

రిపోర్టర్: అశోక్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల బలోపేతం కోసం రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నగరాల విస్తరణ, జనాభా పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్రంలో కమిషనరేట్ల సంఖ్య ఆరుకు చేరుతుంది. దీనివల్ల సైబర్ నేరాల నియంత్రణ, ఆధునిక భద్రతా వ్యవస్థల నిర్వహణ మరింత వేగవంతం కానుంది.