బుడమేరు వరద ఉధృతితో గుడివాడ మండలంలో అధికారుల ముమ్మర చర్యలు

రిపోర్టర్: మహేష్ స్థలం: గుడివాడ

నందివాడ మండలంలో బుడమేరు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. పుట్టగుంట వంతెన వద్ద ప్రొక్లైనర్లతో గుర్రపుడెక్కను తొలగిస్తూ ప్రవాహానికి అంతరాయం లేకుండా చూస్తున్నామని అధికారులు తెలిపారు. కొన్ని పంట పొలాలు నీటమునిగినప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని వారు స్పష్టం చేశారు. గుడివాడ – హనుమాన్ జంక్షన్ రాకపోకలపై ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.