గణేష్ నిమజ్జనంలో డీజే వాహనాల అనుమతిపై లోకేష్ దిశానిర్దేశం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Amaravati

గణేష్ నిమజ్జన వేడుకల్లో డీజే వాహనాల అనుమతిపై వస్తున్న ఫిర్యాదులపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి అనిత మరియు డీజీపీని ఆయన కోరారు. నిమజ్జన సమయంలో ఒక్క డీజే వాహనాన్ని కూడా సీజ్ చేయకూడదని స్పష్టం చేస్తూ ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆయన ఎక్స్ వేదికగా కీలక అభ్యర్థన చేశారు.