రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఏడు సూచనలు

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుసరించాల్సిన విధానాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా ఏడు కీలక సూచనలు చేశారు. విదేశీ పర్యటనలు తగ్గించి దేశంలో ఎక్కువ సమయం గడపాలని, బీజేపీపై ద్వేషం వీడాలని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటులో చర్చల ప్రాధాన్యాన్ని విస్మరించవద్దని, వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలకాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హితవు పలికారు.