బాలల హక్కుల పరిరక్షణకు సమష్టిగా కదలాలని పిలుపునిచ్చిన కలెక్టర్

రిపోర్టర్: SK స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలు మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన పోస్టర్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి అక్రమ రవాణా వంటి సమస్యలను అరికట్టాలని పిలుపునిచ్చారు.