స్థానిక నామినేషన్ల గణాంకాలు విడుదల చేసిన టీడీపీ: తప్పుడు ప్రచారం తిప్పికొట్టామంటూ ప్రకటన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లపై వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని గణాంకాలతో తిప్పికొడుతూ టీడీపీ అధికారికంగా వీడియో విడుదల చేసిందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. నామినేషన్ల దాఖలులో వెనుకబడిందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పూర్తి వివరాలను, గణాంకాలను జాబితా రూపంలో ప్రజల ముందుంచామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.