జీమాడా కార్యాలయంలో ఈడీ సోదాలపై పంజాబ్ లో తీవ్ర రాజకీయ దుమారం

రిపోర్టర్: అశోక్ స్థలం: మోహాలీ

పంజాబ్లోని మొహాలీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈడీ సోదాలు కొనసాగుతుండటంతో ఆప్ ప్రభుత్వం, కేంద్రం మధ్య రాజకీయ ఘర్షణ తీవ్రమైంది. భూసేకరణ అవకతవకల కేసులో జరుగుతున్న ఈ దాడులపై ఆప్ నేతలు ఆందోళన చేపట్టగా, పంజాబ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల వేళ కక్షసాధింపు చర్యలకే ఈడీని వాడుతున్నారని ఆప్ నేతలు మండిపడ్డారు. ఈ పరిణామాలపై అకాళీదళ్, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.