ఆమనగల్లులో ఈనెల 21న ఉచిత కంటి వైద్య శిబిరం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 21న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ పిఆర్ఓ ఎంఏ పాషా తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రాంరెడ్డి లయన్ ఐ హాస్పిటల్ విజన్ సెంటర్లో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. మండల పరిసర గ్రామాల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి చూపు మందగించిన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబర్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.