కన్నీటి సంద్రమైన బొబ్బిలి కోటలో ఆళ్ల నానికి అశ్రునయనాల నివాళి

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో రాష్ట్ర మాజీ ఉప-ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు బేబీనాయన మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ, 2004 నుంచి బొబ్బిలి రాజకుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయని, కోవిడ్ సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. బొబ్బిలి ప్రాంతంతో వారికి వ్యవసాయ క్షేత్రం ద్వారా ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. వారి అకస్మిక మృతి తీరని లోటు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.