ఏపీకి రైల్వే భారీ ఊరట: పది వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: రాము
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అధికారులు తెలిపారు. సెమికండక్టర్ పరిశ్రమలు, ఏఐ రంగానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. విజయవాడ బైపాస్, విశాఖ-బెంగళూరు వందేభారత్ రైలు ఏర్పాటుకు అంగీకరించారు.