ఆక్లాండ్ వేదికగా వన్డే సమరం: న్యూజిలాండ్ తో పోరుకు భారత్ సిద్ధం

రిపోర్టర్: హరి స్థలం: ఆక్లాండ్

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుందని క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా, ఇక్కడ భారత్ కు ఆశించిన రికార్డు లేదని క్రీడా విశ్లేషకులు తెలిపారు. ఇప్పటివరకు ఆడిన పదకొండు మ్యాచ్లలో భారత్ నాలుగు విజయాలు సాధించగా, ఆరు ఓటములు చవిచూసింది.