ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెల్లడి

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం వరుస ఆత్మహత్యల కేసులో విచారణ వేగవంతమైంది. రూ. 25 కోట్ల ఆస్తి కోసం నిందితుడు సాధిక్ పథకం ప్రకారమే కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి అల్లుడు జగదీశ్వరరెడ్డిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. సాధిక్ తీవ్ర బెదిరింపులు, భయాందోళనల కారణంగానే నూకరాజుతో సహా కుటుంబ సభ్యులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.