వంద కోట్ల క్లబ్‌కు చేరువలో 'మిర్జాపూర్ ది మూవీ' వసూళ్లు

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

ఓటీటీ సంచలనం మిర్జాపూర్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన 'మిర్జాపూర్ ది మూవీ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.96.85 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువయింది. కేవలం ఆదివారం రోజే రూ.36.50 కోట్లు రాబట్టింది. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషించారు.