జవహర్ నగర్ జన సంకల్ప యాత్ర: నేడు భారీ బహిరంగ సభ
రిపోర్టర్: శివ
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను పూర్తిగా తరలించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన జన సంకల్ప యాత్ర నాల్గవ రోజు కొనసాగుతోందని ఈటల రాజేందర్ వెల్లడించారు. శుక్రవారం నాడు నాగారం నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర దమ్మాయిగూడ మీదుగా జవహర్ నగర్ వరకు సాగుతుందని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు జవహర్ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఈటల రాజేందర్ పేర్కొంటూ స్థానిక ప్రజలను పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.