అమెరికా రాజకీయాల్ లో సంచలనం: ట్రంప్ బ్రాండ్ కు ఎదురుదెబ్బ తగిలిందంటూ విశ్లేషణ
రిపోర్టర్: నరేష్
స్థలం: అమెరికా
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలలో రిపబ్లికన్ పార్టీకి ఊహించని షాక్ తగిలిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. దశాబ్దాలుగా కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాలలో డెమొక్రాట్లు ఘనవిజయాలు సాధించారని నిపుణులు పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ అతిగా జోక్యం చేసుకోవడం, ప్రభుత్వ విధానాలపై ప్రజా వ్యతిరేకత పెరగడం వల్లే ఈ పరాజయం చవిచూడాల్సి వచ్చిందని విశ్లేషకులు వెల్లడించారు. కీలకమైన సెనేట్ స్థానాలను కోల్పోవడం రిపబ్లికన్ల ఆధిపత్యానికి పెద్ద దెబ్బని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.