పర్యావరణ పరిరక్షణకై వెంగల కనకయ్య కుమారులు మట్టి గణపతుల పంపిణీ
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తి ప్రాంతంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంగల కనకయ్య కుమారులు సత్యనారాయణ, శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో గత మూడేళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తులందరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను పక్కనబెట్టి పర్యావరణహితమైన మట్టి గణపతులను మాత్రమే ప్రతిష్ఠించి పూజలు జరుపుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనేకమంది స్థానిక నివాసితులు ఉత్సాహంగా పాల్గొని విగ్రహాలను స్వీకరించడం జరిగింది.