కాంగ్రెస్ కరెంటు కుట్రలపై రేపు పవర్ ప్లాంట్ల పర్యటన

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు థర్మల్ పవర్ స్టేషన్లలో జరుగుతున్న నిజానిజాలను తేల్చడానికి బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా రేపు ఆరు ప్రత్యేక బీఆర్ఎస్ బృందాలు వివిధ పవర్ స్టేషన్లలో పర్యటించనున్నాయి. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని, పంపులు ఆన్ చేసి వెంటనే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పర్యటన చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.