లక్షేట్టిపేటలో విషాదం పొలంలో పాముకాటుకు గురై రైతు మృతి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్షేట్టిపేట

లక్షేట్టిపేట మండలంలోని బలరావ్ పేట గ్రామంలో పాముకాటుతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆ గ్రామానికి చెందిన మండే పోచయ్య గురువారం ఉదయం పొలానికి వెళ్ళగా, అక్కడ ఆయనను పాము కాటు వేసింది. దీంతో పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షేట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోచయ్య మృతితో ఆయన కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.