పల్నాడు జిల్లాలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహణ

రిపోర్టర్: వెంకట్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లాలో నేర నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులు మరియు చెడు నడత కలిగిన వారిని పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.