అచ్యుతాపురంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి అన్న సమారాధన

రిపోర్టర్: I am Farmer 🍅🌱 స్థలం: అచ్యుతాపురం

అచ్యుతాపురంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత భక్తిభావంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో గ్రామం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు.