హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై ముస్లిం మత గురువుల తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: వెంకట్ స్థలం: భారతదేశం

భారత మాజీ ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీ హిందూ తీవ్రవాదం మరియు ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీదీతో పాటు చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ తీవ్రంగా ఖండించారు. పదవిలో ఉన్నప్పుడు ముస్లింల అనుకూల వ్యాఖ్యలు చేయని అన్సారీ, ఇప్పుడు పదవి విరమణ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు మండిపడ్డారు. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా, సామాజిక వాతావరణాన్ని పాడుచేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మత గురువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.