కార్మికులను వేధిస్తున్న ఏఈని వెంటనే సస్పెండ్ చేయాలి
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘటం ఏపీ ట్రాన్స్కో సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న కార్మికులపై ఏఈ కే చలపతి రావు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తన ఇంటి పనులకు సహకరించలేదనే దురుద్దేశంతో కార్మికులకు సెలవులు నిరాకరించడంతో పాటు ప్రాణాలకు ముప్పు ఉన్నా లైన్ లైవ్ లో ఉంచి పనులు చేయిస్తున్నారు. ఈ వేధింపులపై జిల్లా అధికారులు స్పందించి ఏఈపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.