జన్నారంలో బుధవారం భారీగా కలప వేలం నిర్వహించనున్న అటవీశాఖ అధికారులు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లో టేకు మరియు నాన్ టేకు కలప అమ్మకం నిమిత్తం బుధవారం ఉదయం పదిన్నర గంటలకు టింబర్ డిపోలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు అటవీ శాఖ డివిజన్ అధికారి రామ్మోహన్ తెలిపారు. ఆసక్తి గల కొనుగోలుదారులు తగిన ధరావత్ సొమ్మును ముందుగా చెల్లించి ఈ వేలంపాటలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన స్థానిక విలేకరులకు స్పష్టం చేశారు.