నవోదయ పాఠశాలలకు స్థలాలు ఇచ్చేది లేదన్న తమిళనాడు ప్రభుత్వం

రిపోర్టర్: సునీల్ స్థలం: తమిళనాడు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ రాష్ట్రంలో ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసిన స్టాలిన్ సర్కార్, నవోదయ పాఠశాలల ఏర్పాటుకు భూములు కేటాయించేది లేదని తేల్చిచెప్పింది. మూడు నెలల్లో స్థలాలు కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, భాషా హక్కుల పరిరక్షణే ముఖ్యమని భావిస్తూ కేంద్ర-రాష్ట్రాల మధ్య రాజకీయ పోరును పరాకాష్టకు చేర్చింది.