ధర్మ మార్గంలో ప్రగతి పథాన సాగుతున్న దేశ సేవా సంకల్పం

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతానికి చెందిన మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన పవిత్ర పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో భేటీ అయిన ఆయన, దేశ ప్రజల సుఖసంతోషాలు, తెలంగాణ రాష్ట్ర సమగ్ర ప్రగతి, ఆర్థిక పురోగతి మరింత వేగంగా జరగాలని ఆ భగవంతుడిని ప్రత్యేకంగా ప్రార్థించారు. దేశ శ్రేయస్సు, ధర్మ పరిరక్షణ, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ నిరంతరం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు వెల్లడించారు.