విశాఖ జోన్ ఈగల్ బృందం దాడులు: మెడికల్ షాపుల్లో తనిఖీలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా కేంద్రంలోని పలు ఔషధ దుకాణాలపై ఈగల్ బృందం, పోలీసులు, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మంగళవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మత్తుపదార్థాల అక్రమ నిల్వలు, విక్రయాల రికార్డులను పరిశీలించినట్లు నార్కోటిక్ కంట్రోల్ బోర్డు జోన్ ఇన్ స్పెక్టర్ సతీష్ కుమార్, అధికారిణి లావణ్య తెలిపారు. సరైన ధ్రువపత్రాలు, వైద్యుల చీటీలు లేకపోతే మెడికల్ షాపుల లైసెన్సులు తక్షణమే రద్దు చేస్తామని అధికారులు గట్టిగా హెచ్చరించారు.