పశ్చిమబెంగాల్ ఉప ఎన్నికల్లో మమతాబెనర్జీ వర్గానికి వరుస ఎదురుదెబ్బలు

రిపోర్టర్: సతీష్ స్థలం: పశ్చిమబెంగాల్

పశ్చిమబెంగాల్ ఉప ఎన్నికలకు ముందు మమతాబెనర్జీ వర్గానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నందిగ్రామ్‌లో అభ్యర్థి సంచితా ప్రధాన్‌ డే నామినేషన్ ఉపసంహరించుకున్న మరుసటిరోజే రేజీనగర్‌లోనూ మమత వర్గం అభ్యర్థి రబియుల్‌ ఆలం చౌధురి ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. పార్టీకి అధికారిక గుర్తు లేకపోవడం, కార్యకర్తలు ఇబ్బంది పడుతుండటంతో పోటీ చేయడం కష్టంగా మారిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మమత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.