కడెం ప్రాజెక్టు అందాలను వీక్షించిన ఎమ్మెల్యే మురళి నాయక్

రిపోర్టర్: Radha. A స్థలం: కడెం

మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా నాయక్ కడెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు చారిత్రాత్మక కడెం ప్రాజెక్టును సందర్శించి బోటులో ప్రయాణించారు. ప్రాజెక్టు విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అతిథులకు ఘన స్వాగతం పలికారు.