కవ్వాల్ అడవుల్లో పర్యటించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్
రిపోర్టర్: Radha. A
స్థలం: కడెం
నిర్మల్ జిల్లా కడెం మండలంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా నాయక్ పర్యటన కొనసాగింది. అటవీ శాఖ అధికారులతో కలిసి వారు ప్రసిద్ధ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో పర్యటించి ప్రకృతి అందాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు గంగన్న, నాయకులు బబ్లు, ముస్కు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.