అమిత్ షా పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విభజన హామీలపై ఆయన ఎందుకు స్పష్టత ఇవ్వలేదని నిలదీశారు. ముగ్గురు గుజరాతీయుల కోసమే మోదీ, అమిత్ షా పనిచేస్తున్నారని, దేశాన్ని అదానీకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.