రామాయణం సినిమా సంగీతంపై వస్తున్న విమర్శలపై స్పందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
రామాయణం సినిమాకు తాను అందించిన సంగీతంపై వస్తున్న విమర్శలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తాజాగా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను ఎంతో కష్టపడి నిజాయితీగా పని చేశానని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని, ప్రజలు తన సంగీతాన్ని ఆస్వాదిస్తారనే నమ్మకం ఉందని రెహమాన్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్తో కలిసి పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన వెల్లడించారు.