ఏలూరు నగరంలో డ్రోన్ల ద్వారా పోలీసుల నైట్ పెట్రోలింగ్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఏలూరు

ఏలూరు నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా మరియు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలు, రద్దీ రోడ్లలో ఈ నిఘా నిరంతరం కొనసాగుతోంది. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాధారణ కార్యకలాపాలు కనిపిస్తే ప్రజలు తక్షణమే 112 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.