తీవ్ర అలర్ట్: తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో రానున్న కొన్ని గంటల్లో తేలికపాటి వర్షాలు మరియు ఉరుములతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ (IMD Hyderabad - తెలంగాణ వాతావరణ సూచనలు & వర్ష హెచ్చరికలు) వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలలో గాలి వేగం గంటకు నలభై కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.