స్థానిక సమరానికి సై అంటున్న చంద్రగిరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చంద్రగిరి

చంద్రగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత విజయవంతమైంది. ప్రతి పంచాయతీ నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో వైఎస్ఎంఆర్ కల్యాణ మండపం కిక్కిరిసిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి తాము సిద్ధమంటూ నాయకులు సంకేతాలు ఇవ్వగా, గెలుపు గుర్లకే అవకాశం కల్పిస్తామని వక్తలు స్పష్టం చేశారు.