గోదావరిఖనిలో ఇందిరా గాంధీకి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత కోసం ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.